ప్రభుత్వ పాఠశాల కు బెంచీలు విరాళంగా అందించిన గ్రామ సర్పంచ్ స్వాతి శ్రావణ్ కుమార్

June 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందపుర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో బెంచీలను విరాళంగా అందజేసిన సర్పంచ్ కట్టెల స్వాతి -దాసి శ్రావణ్ కుమార్ గోవిందపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కోసం తన సొంత ఖర్చులతో బెంచీలను విరాళంగా అందజేశారు అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలపై గ్రామస్తులకు నమ్మకం కల్పించేలా తన సొంత కుమారుడిని అదే పాఠశాలలో అడ్మిషన్ చేపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరి బడి మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రవేట్ పాఠశాలలకు పంపించి కుటుంబ భారం అధికంగా పెంచుకోకూడదని అన్నారు కావున మన గ్రామంలోని పిల్లలను మన పాఠశాలలోనే చేర్పించాలని మన గ్రామం ఇంకో గ్రామానికి ఆదర్శంగా నిలవాలని అందుకనే నా కొడుకుని కూడా ఇక్కడే చేర్పించానాని తెలియజేశారు……

🌐 Select Language:
📰 ePaper