పల్స్ పోలియోను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసిన పెబ్బేరు మున్సిపల్ చైర్మన్, అక్కి శ్రీనివాస్ గౌడ్
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 29 2026 రోజున పెబ్బేరులో గల గ్రంథాలయం ఆవరణంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు ప్రారంభించడం జరిగింది.చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని ఆయన సందర్శించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్క చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.గతంలో పోలియో మహమ్మారి వల్ల ఎంతోమంది చిన్నారులు అంగవైకల్యానికి గురయ్యారని, ఆ పరిస్థితి మళ్లీ రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోందని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా ఉండిపోకూడదని, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మొదటి రోజు కేంద్రాలకు రాలేని వారి కోసం రేపు, ఎల్లుండి సిబ్బంది ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేస్తారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై వెంకటేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పర్వీన్ షకీల్, సౌజన్య దిలీప్ రెడ్డి, హరి శంకర్ నాయుడు, మన్యం, వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.