సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎస్సైకి 25000 వేల చెక్ అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్

June 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ; శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పత్తిపాక గ్రామపంచాయతీ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చింది.
గ్రామంలోని ముఖ్య కూడళ్లు, సెంటర్లలో ముఖ్యమైన పరిసరాల్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు గ్రామపంచాయతీ తరఫున సర్పంచ్ గజ్జి ఐలయ్య,ఉప సర్పంచ్ తుడుం రాజు లు స్థానిక ఎస్సై పరమేశ్వర్ కు రూ. 25,000 అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ, “గ్రామస్తుల భద్రత కోసం పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. సీసీ కెమెరాల నిఘా వల్ల దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చు. త్వరలోనే కెమెరాలు అమర్చి పర్యవేక్షణ ప్రారంభిస్తాం” అని తెలిపారు. అనంతరం పత్తి పాక గ్రామ సర్పంచ్ ఐలయ్య మాట్లాడుతూ, “గ్రామ భద్రతే మా ప్రథమ కర్తవ్యం. పోలీసు శాఖ సహకారంతో పత్తిపాకను నేరరహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కోర్రె రాజారాం, స్థానిక రిపోర్టర్ తుడుం క్రాంతి కుమార్ గ్రామ పోలీసు అధికారి రామానాదం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…..

🌐 Select Language:
📰 ePaper