గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీస్ స్టేషన్ లో పలు సూచనలు

September 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు, సభ్యులను మండలం పోలీసులు పిలిపించి తగు సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు.సీఐ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన, ఎస్‌ఐ పరమేశ్ సమక్షంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీ ఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మండపాల వద్ద భద్రతా చర్యలు పాటించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలని సీ ఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేశ్వర్ సూచించారు. ప్రజలు, భక్తులు సహకరించి గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సీ ఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలియజేశారు…

🌐 Select Language:
📰 ePaper