సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా అధికారులు

September 9, 2026 | ఆంధ్రప్రదేశ్

జనంజనం న్యూస్ సెప్టెంబర్9ముమ్మిడివరం(గ్రంధినానాజీ) మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎండాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి సుభాష్‌తో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వాగతం పలికారు.‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా మాచవరంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పార్టీ క్యాడర్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ గంటి హరీష్ మాధూర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుత్తుల సాయి, గంధం పల్లంరాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper