కుడా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి.
జనం న్యూస్ సెప్టెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి టీ పి యు ఎస్ ఘన సన్మానంవరంగల్: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కుడా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం టీ పి యు ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు ఆమెకు శాలువా కప్పి, ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సుధారాణి ప్రజాసేవలో మరింత ఉన్నతంగా రాణించి, వరంగల్ నగర సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీ పి యు ఎస్ నాయకులు: వరంగల్ జిల్లా అధ్యక్షులు కొడం రవి ప్రకాష్ , ప్రధాన కార్యదర్శి శ్రీ గుర్రపు రాజమౌళి , రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేవులపల్లి సాయిరాజ్ , సహాధ్యక్షులు బొద్దున వెంకటేశ్వర్లు , ఉపాధ్యక్షులు కొండ శ్రీనివాస్ , గుండు కామేశ్వరరావు * రిటైర్డ్* ప్రధాన కార్యదర్శి,కార్యనిర్వాహక కార్యదర్శి గోరంటాల అశోక్ , ప్రచార కార్యదర్శి కోడూరి రమేష్ , కార్యవర్గ సభ్యులు వడ్నాల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు….