ట్రస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
జనం న్యూస్ :9సెప్టెంబర్ బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ :సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పి, వారిని సన్మార్గంలో నడిపించాలని, ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.ట్రస్మా ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్‌లోని కేఎంఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని వివేకానంద విద్యాలయానికి చెందిన ఉపాధ్యాయులు దామరపల్లి భాగ్యమ్మ, ఫిర్దోజ్లను ఎంపీ రఘునందన్ రావు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనదని అన్నారు. మారుతున్న సాంకేతిక యుగంలోనూ గురువు స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదని కొనియాడారు.విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ, గురువులు నేర్పిన నైతిక విలువలను జీవితంలో పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.