కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు

September 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల . భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి*, భూపాలపల్లి మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం…100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజులు పూర్తి అయినా ఇప్పటి దాకా ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఇందులోప్రధానంగా:కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయాలి.మహిళలకు హామీ ఇచ్చిన ₹ 2500/- ఆర్థిక సహాయాన్ని అమలు చేయాలి.గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలి.రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్ అవసరమైన ఎరువులు యాప్ తొలగించి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి.ఆడబిడ్డలకి మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం, స్కూటీ అందించాలి.ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి.రైతన్నలందరికీ ప్రతి పంటకు రైతు భరోసా, రైతు బీమా, యాప్ తొలగించి కొరత లేకుండా ఎరువుల పంపిణీ, పంటలకు బోనస్, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12,000 సహాయం.ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు.అర్హులైన నిరుద్యోగ యువతకు, నిరుద్యోగ భృతి, ఉద్యోగం, జాబ్ క్యాలెండర్ అమలు.విద్యార్థులకు విద్యా భరోసా, పెండింగ్ ఫీజు బకాయిల చెల్లింపువృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెంచిన 4 వేల పింఛన్.దివ్యాంగులకు ₹ 6000/-పింఛన్.ఆటో అన్నలకి ఏడాదికి 12,000 రూపాయలు అందించాలి.బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, విద్యార్థి, యువజన, రైతు వంటి వర్గాలకు ఇచ్చిన అన్ని డిక్లరేషన్ల హామీలు, గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలి.
అంబేద్కర్ మీరు కలలు కన్న సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇచ్చిన హామీలను విస్మరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మా అభిప్రాయం.అందువల్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేసి, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.జై భీమ్!
జై తెలంగాణ!జై బీఆర్ఎస్ ఈ కార్యక్రమంలో గోవిందా పురం గ్రామ సర్పంచ్ స్వాతి శ్రావణ్ కుమార్ దాసి శ్రావణ్ కుమార్, మేకల వెంకటేశ్వర్లు, చెన్నబోయిన అజయ్ కుమార్, మారపల్లి నందం, సవాసి రమేష్, కలువాల నరేందర్, నర్ర రాజు, దైనంపల్లి కరుణ్ బాబు, కొమ్మల శివ,విచెన్నబోయిన విద్యాసాగర్, రంగు మహేందర్, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

🌐 Select Language:
📰 ePaper