వైస్‌ ప్రెసిడెంట్ అత్తను పరామర్శించిన ఎంపీపీ

September 9, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు: మండల వైస్‌ ప్రెసిడెంట్ తుమ్మల భావన శ్రీధర్ అత్త తుమ్మల లక్ష్మీదేవి బైపాస్‌ సర్జరీ అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మండల ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి మంగళవారం ఆమెను పరామర్శించారు. ఈ సంద ర్భంగా ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఎంపీపీ ఆకాంక్షిం చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంటానని భరోసా ఇచ్చారు.ఈకార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యులు కరీముల్లా ఖాన్,బూసి రెడ్డి రాజశేఖర్ రెడ్డి,మోహన్ రెడ్డి,విజయుడు, స్థానిక నాయ కులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper