విద్యతో పాటు వినయం, క్రమశిక్షణ అలవర్చుకోవాలి: జి. హరినాథ్

September 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : 9సెప్టెంబర్ బుధవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;సిద్దిపేట పట్టణం నలంద విద్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలోని ఉపాధ్యాయులను సన్మానించి, గురువుల పట్ల తమకున్న గౌరవాభిమానాలను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో విద్యకు, ఉపాధ్యాయులకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉందన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తూ, వారిని ఉన్నతమైన లక్ష్యాల వైపు నడిపించడం తమ బాధ్యతగా భావిస్తున్నా మని తెలిపారు.పాఠశాల కరెస్పాండెంట్ జి.హరినాథ్ మాట్లాడుతూ కౌరవులు, పాండవులకు గురువుగా విద్యాబోధన చేసిన ద్రోణాచార్యులను ప్రస్తావిస్తూ, గురువు స్థానం ఎంతో గొప్పదని అన్నారు. ప్రస్తుత తరంలో విద్యార్థులు విద్యతో పాటు వినయం, విధేయత, క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి డాక్టర్లు, లాయర్లు, పోలీస్ అధికారులు, మంచి రాజకీయ నాయకులు, దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.విద్యార్థులు మంచి విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, వినయ విధేయతలతో మెలగాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు గురువుల మార్గదర్శకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నిత్యశ్రీ, ఉపాధ్యాయులు అనిత, ఆమ్రిన్, మమత, సంగీత, శిరీష, సిద్ధిరియా, ఫాతిమా తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper