వడ్డేపల్లి ఎంఈఓ నర్సింహులు సస్పెన్షన్
జనం న్యూస్ 09 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రిజిస్ట్రేషన్ లేని పాఠశాల నిర్వహణకు అనుమతివిద్యార్థుల రికార్డుల బదిలీలో నిర్లక్ష్యంపై చర్యలు గద్వాల:వడ్డేపల్లి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) నర్సింహులును సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఓ పాఠశాలను విద్యార్థులతో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం విద్యార్థుల విద్యా బోనఫైడ్ రికార్డుల బదిలీలో నిర్లక్ష్యంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.పాఠశాల మార్పు జరిగినప్పటికీ విద్యార్థుల రికార్డులు కొత్త పాఠశాలకు సక్రమంగా బదిలీ కాలేదని పలువురు తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో విద్యార్థుల చదువులు బోనఫైడ్ వివరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాల రిజిస్ట్రేషన్ విద్యార్థుల విద్యా రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై విచారణ జరిపి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంఈఓ నర్సింహులు సస్పెన్షన్‌ను కలెక్టర్ స్వయంగా వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన విద్యా రికార్డుల విషయంలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు