భూ సర్వేతో గ్రామ ప్రజలకు లబ్ది చేకూరుతుందిSIR విచారణలో తప్పిదాలు ఉండకూడదు – బాన్సువాడ RDO రవీందర్ రెడ్డి

మద్నూర్ సెప్టెంబర్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ లో SIR విచారణ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని బాన్సువాడ RDO రవీందర్ రెడ్డి అధికారులకు సూచించారు.బుధవారం మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో జరుగుతున్న SIR విచారణ కేంద్రాలను RDO పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల సందేహాలను నివృత్తి చేశారు. విచారణలో భాగంగా తీసుకునే ధ్రువపత్రాల సమర్పణ, ఆన్‌లైన్ అప్లోడింగ్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.అనంతరం మేనూర్ గ్రామ శివారులో పంట కాలువ, పంట చేనులకు వెళ్లే దారి విషయంపై వచ్చిన ఫిర్యాదుపై RDO క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మండల తహసీల్దార్, సర్వేయర్, గిర్దావర్‌లతో కలిసి సంబంధిత భూములు, కాలువలను పరిశీలించారు. ఈ సమస్యపై సంబంధిత ఇరిగేషన్ శాఖ, సర్వేయర్లు ఉమ్మడిగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.సోమూర్ గ్రామంలో రీ సర్వే పనుల పరిశీలనమద్నూర్ మండలం సోమూర్ గ్రామానికి నక్ష, మ్యాపులు లేకపోవడంతో రెండు నెలలుగా రీ సర్వే పనులు జరుగుతున్నాయి. గ్రామ సరిహద్దులు, పంట పొలాలు, పట్టాదారుల చేలు, ప్రభుత్వ భూములను గుర్తిస్తూ హద్దులు ఏర్పాటు చేస్తున్నారు.సోమూర్ గ్రామంలో జరుగుతున్న సర్వే తీరును RDO రవీందర్ రెడ్డి గారు పత్తి, సోయా చేల్లో కలియ తిరుగుతూ పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ సర్వేలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ “ఇన్ని ఏళ్ల తర్వాత ప్రభుత్వం సర్వే చేయించి హద్దులు గుర్తించడం, నక్ష-మ్యాపులు తయారు చేయడం సంతోషంగా ఉంది. దీనివల్ల భూ వివాదాలు తగ్గి మాకు లబ్ది చేకూరుతుంది” అని అన్నారు.కాళోజీ జయంతి వేడుకలుఅనంతరం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా రచయిత, ప్రజా కవి కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా మహాకవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇలాంటి ప్రజా కవుల రచనలు ఎంతో మందిని చైతన్యవంతం చేశాయని కొనియాడారు. ఇలాంటి మహనీయుల ఆశయాలతో తెలంగాణ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల తహసీల్దార్ ఎం.డి. ముజీబ్, DI తిరుమలేశ్, సర్వేయర్ వెంకటి, గిర్దావర్ మురళీధర్, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, పలు గ్రామాల సర్పంచ్‌లు, రైతులు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు పాల్గొన్నారు.