గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం
రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో గుడిసె వాసులకే ప్రాధాన్యత: మంత్రి పొంగులేటి
క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలి
రూఫ్ రీప్లేస్మెంట్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్టు వెల్లడి
తెలంగాణ లో : రెండో విడత ఇందిరమ్మ
జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ తేదీ 18-06-2026 ఇండ్ల మంజూరులో గుడిసెల్లో ఉంటున్న వారికే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా స్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో జీవించకుండా సొంత ఇంటిలో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలు, గుడిసెల గుర్తింపు. రూఫ్ రీప్లేస్మెంట్ పథకం, అసంపూర్తి గృహాల వివరాల సేకరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రం లోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధి లో ఉన్న గుడిసెలను యుద్దప్రాతిపదికన గుర్తిం చేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారుల ను మంత్రి ఆదేశించారు. “ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలి. ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులన్నింటి నీ ప్రత్యక్షంగా పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలి. ఎంపీడీవో స్థాయిలో జాబితాలను సిద్దం చేసి సంబంధిత ఇన్చార్జి మంత్రుల ఆమె దానికి పంపించాలి. సర్వే ప్రక్రియలో పూర్తి పార దర్శకత పాటించాలి. అర్హుల ఎంపికలో కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా ఎటువంటి పా రపాట్లు, వివక్షకు తావు లేకుండా అనర్హుల పేర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలి” అని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేప థ్యంలో క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజ కవర్గానికి 2,000 ఇండ్ల చొప్పున మంజూరు చేసిన నేపథ్యంలో అర్హుల ఎంపికను పూర్తిస్థాయిపారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రూఫ్ రీప్లేస్ మెంట్ పథకానికి ప్రాధాన్యత పేదల నివాస భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్ర భుత్వం రూఫ్ రీప్లేస్మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెండో విడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇండ్లను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు వెల్లడిం చారు. గోడలు, పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులు టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్లు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పైకప్పుల కింద నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న కుటుం బాలను గుర్తించి వారికి ఆర్సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్ధిక సహాయం అం దించనున్నట్లు తెలిపారు. అసంపూర్తి ఇండ్లకు కూడా అవకాశం గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. పాత ఇందిరమ్మ పథకం కింద మంజూరై బేస్మెంట్ స్థాయి లేదా పైకప్పు స్థాయిలో నిలిచిపోయిన ఇళ్లను కూడా ఈ పథకంలో చేర్చవచ్చని పేర్కొన్నారు. అలాగే గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహాలను కూడా గుర్తించి రూఫ్ అప్గ్రేడేషన్ కార్యక్రమం ద్వారా పూర్తి చేయడాని కి చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఎల్సీ (బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్) విధానంలో లబ్ధి దారుడే తన ఇంటిని నిర్మించుకొనే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని చిన్న స్థలాలు కలిగిన లబ్దిదారులకు అవసరాన్ని బట్టి గ్రౌండ్ ప్లస్ వన్ (జి+1) నిర్మాణా లకు కూడా అనుమతి ఇవ్వవచ్చని పేర్కొన్నారు.