గృహగణనను సకాలంలో పూర్తి చేయాలి హనుమకొండ ఆర్డీవో, అడిషనల్ సెన్సెస్ అధికారిరాథోడ్ రమేష్

May 19, 2026 | వైరల్ వార్తలు

, జనం న్యూస్ 19 ఏప్రిల్ 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) 8వ భారత దేశ కుటుంబ, జనాభా గణనలో భాగంగా మొదటి దశలో నిర్వహిస్తున్న గృహ గణనను సకాలంలో పూర్తి చేయాలని హనుమకొండ ఆర్డీవో, అడిషనల్ సెన్సెస్ అధికారి రాథోడ్ రమేష్ సిబ్బంది కి సూచించారు.  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర, బావుపేటలో జరుగుతున్న గృహ గణనను ఆయన మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకా లను సమర్ధవంతంగా అమలు చేసేందుకు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనాభా, గృహాల లెక్కలు నమోదు చేస్తున్నదని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్‌ పద్ధతిలో జనాభా గణనను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎల్కతుర్తి మండలంలోని 13 గ్రామాల పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో 70 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్యుమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, 12 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వెంట తహసీల్దార్ ప్రసాదరావు, డివిజనల్ గణాంక అధికారి రమేష్ చందర్, ఏ నాగేశ్వరరావు, ఎన్యుమరేటర్లు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper