ఘనంగా శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ జయంతి వేడుకలు

July 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూలై 06,అచ్యుతాపురం:భారత ప్రభుత్వ తొలి కేబినెట్ మంత్రి, భారతీయ జనసంఘ్ స్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను అచ్యుతాపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు కూండ్రపు నాయుడు బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రాజాన సన్యాసి నాయుడు, జిల్లా కార్యదర్శి కోరుపోలు చిన్నారావు మాట్లాడుతూ కాశ్మీర్‌ కోసం డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఎన్నో పోరాటాలు చేశారన్నారు. నేడు భారతదేశంలో కాశ్మీర్‌ అంతర్భాగంగా ఉందంటే ముఖర్జీ బలిదానమే ప్రధాన కారణమన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి తన ప్రాణాలు అర్పించిన గొప్ప జాతీయవాది ముఖర్జీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అగ్గాల హనుమంతరావు,జేవిఎస్ రాజు, చుక్క అనురాధ,కుమారి దేవి ,ఎండపల్లి రాజు,బండారు నాయుడు,పీలా శ్రీను , కే వాసుదేవర,తురాయి శ్రీరాములు, సిరా చిరంజీవి, జయశంకర్,పెంటకోట జయ అప్పారావు, మల్ల రామ జోగినాయుడు, మెరుగు కాసు బాబు,ఎల్లపు రాజేశ్వరరావు, దొడ్డి అప్పారావు,వంకా కృష్ణారావు, రాజాన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper