ఫ్లైఓవర్ రహదారి విస్తరణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
సబ్ టైటిల్ :ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్, జూలై 06,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్లోని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నివాసంలో ఆర్అండ్బీ (రోడ్లు & భవనాలు) శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ అచ్యుతాపురం–ఫ్లైఓవర్,అనకాపల్లి ప్రధాన రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అలాగే, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.