దరఖాస్తులగల్లంతుపై జాయింట్ కలెక్టర్ ను కలిసిన నందలూరు పాత్రికేయులు.
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 06-07-26నందలూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం నందు దరఖాస్తులు గల్లంతుపై సోమవారం నందలూరు పాత్రికేయులు సబ్ కలెక్టర్ హెచ్. ఎస్. భావన.ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాసిల్దార్ కార్యాలయంలో పాత్రికేయులు పలుమార్లు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు గల్లంతయ్యాయని అంతేకాక మండలంలో ఉన్న ప్రధానమైన సమస్యలు చెరువు కబ్జా, డివైడర్ మీద ఫ్లెక్సీల, గురించి మండలంలోని అనేక సమస్యల ను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించి ప్రధాన సమస్యలపై, దరఖాస్తుల గల్లంతుపై విచారణ చేపట్టను న్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కాకతీయ విలేఖరి డి రామకృష్ణ. న్యాయం విలేకరి డేవిడ్ కళ్యాణ్ రాజ్. జనం న్యూస్ విలేకరి కిరణ్ కుమార్ ఆర్ కె న్యూస్ విలేకరి రవి కుమార్, ప్రజాకీర్తి విలేకరి అబ్దుల్ హుస్సేన్, జనం విలేకరి జయసింహా తదితరులు పాల్గొన్నారు.