ఎల్కతుర్తి–మడిపల్లి రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

July 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 6 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )ఎల్కతుర్తి, జూలై 6: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎల్కతుర్తి–మడిపల్లి రహదారి 13 కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రరాంరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మంత్రి మాట్లాడుతూ ఎల్కతుర్తి మండల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రహదారి అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.అనంతరం పంజాబ్‌లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన ఎల్కతుర్తి మండలానికి చెందిన యువ బాక్సర్ ఎండీ అంబ్రీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా దామెర గ్రామానికి చెందిన యువకులు ఎస్బీఐ బ్యాంకు సమీపం నుంచి ఎల్కతుర్తి సర్కిల్ మీదుగా దామెరకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్వయంగా అక్కడికి వెళ్లి రహదారిని పరిశీలించి, సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునిగడప లావణ్య శేషు ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి, బొమ్మన పెల్లి అశోక్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి గోలి రాజేశ్వర్ రావు ఎంపీటీసీ సభ్యులు, డైరెక్టర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper