నిరుపేదలకు బెడ్‌షీట్ల పంపిణీ చేసిన లయన్స్ క్లబ్
జనం న్యూస్ : 6 జూలై సోమవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ ;నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెడ్‌షీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లగిశెట్టి నరసింహులు మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవడం లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి శ్రీధర్, ఖజాంచి శ్రీనివాస్, జోన్ చైర్‌పర్సన్ దాసరిపల్లి జోజి తదితరులు పాల్గొన్నారు.