చికెన్ మటన్ దుకానుల యజమానులకు పరిశుభ్రత నిర్మాణం పై అవగాహన….

July 14, 2026 | తెలంగాణ

—మున్సిపల్ కమిషనర్ షేక్ హయూమ్

బిచ్కుంద జులై 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద పట్టణంలోని చికెన్ మరియు మటన్ దుకాణాల యజమానులకు పరిశుభ్రత నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా దుకాణాలు, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజారోగ్యానికి హాని కలగకుండా అవసరమైన అన్ని పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అలాగే, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, వాటి స్థానంలో వస్త్ర సంచులు, కాగితపు సంచులు లేదా ఇతర పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని మునిసిపల్ కమిషనర్ దుకాణదారులకు సూచించడం జరిగింది.పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో ప్రతి వ్యాపారి తన వంతు బాధ్యతగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించి, ప్లాస్టిక్ రహిత వాతావరణం ఏర్పాటుకు సహకరించాలని కమిషనర్ గారు తెలపడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper