విద్యాసంస్థల్లో నైతిక విలువలకు పెద్దపీట-పర్వతనేని ఆశ ఫౌండేషన్ ట్రస్ట్
స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులకు రెండు విశిష్ట అవార్డుల ప్రకటన
జనం న్యూస్- జూలై 14- నాగార్జునసాగర్ టౌన్-విద్యార్థుల్లో కేవలం మార్కులే కాకుండా వారి సత్ప్రవర్తన, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహించేందుకు పర్వతనేని ఆశ ఫౌండేషన్ ట్రస్ట్ ఈ విద్యాసంవత్సరం నుండి స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులకు రెండు ప్రత్యేక అవార్డులను అందజేయ దలిచామని ఆ సంస్థ ఫౌండర్ పర్వతనేని పెదబాబు ఒక ప్రకటనలో తెలిపారు.1-నోబుల్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు:-నిజాయితీ, క్రమశిక్షణ, కరుణ మరియు బాధ్యతాయుత ప్రవర్తనతో తోటివారికి ఆదర్శంగా నిలిచే విద్యార్థికి లభిస్తుంది. (విజయానికి ముందే వ్యక్తిత్వం, స్వార్థానికి ముందే సేవ, నిజాయితీతో కూడిన ప్రతిభ).2-ది ఛాన్స్ అవార్డు- చదువుతో సంబంధం లేకుండా, క్రమశిక్షణతో ఉంటూ తమను తాము నిరూపించుకోవాలనుకునే విద్యార్థులకు ఈ అవార్డు ఒక అద్భుత అవకాశం అని ఆయన తెలిపారు. ఈ అవార్డులు పొందటానికి అర్హత:-90% పైగా హాజరు, ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేని, కనీసం ఏడాదిగా చదువుతున్న విద్యార్థులు.అవార్డుల ఎంపిక ప్రక్రియ:-ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ మరియు ట్రస్ట్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని,విజేతలైన ఇద్దరు (2) విద్యార్థులకు స్కూల్ యానివర్సరీ రోజున ప్రత్యేక మెడల్, ట్రోఫీ, సర్టిఫికేట్‌తో పాటు ఒక్కొక్కరికి రూ. 30,000 చొప్పున స్కాలర్‌షిప్/ఎడ్యుకేషనల్ గ్రాంట్ అంద జేయ బడుతుందనీ, అలాగే పాఠశాల గౌరవ బోర్డుపై వారి పేర్లను శాశ్వతంగా లికిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులలో మంచి వ్యక్తిత్వం ,సేవాభావం, నైతిక విలువలు పెంపొందించడంలో ఈ అవార్డులు దోహదపడతాయని పర్వతనేని ఆశ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రిన్సిపల్ ఏ శివకుమార్, కరస్పాండెంట్ కె నకులరావు, తదితరులు పాల్గొన్నారు.