హెల్ప్ డెస్క్‌లను సందర్శించిన జిల్లా ఇంచార్జ్ యాళ్ల దొరబాబు & బిజెపి నాయకులు
జనం న్యూస్ జూలై 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఓటర్ల ప్రత్యేక సవరణపై క్షేత్ర స్థాయిలో పరిశీలనగుంటూరు :
భారత్ మాతాకీ జై నినాదాలతో గుంటూరు తూర్పు నియోజకవర్గం 14వ మండలంలోని 132, 133 పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు బీజేపీ నాయకులు సందర్శించారు.జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జిల్లా బాధ్యులు యాళ్ళ దొరబాబు, తూర్పు నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేక సవరణ బాధ్యులు కుమార్ గౌడ్, డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్, 6వ క్లస్టర్ బాధ్యులు పోతురాజు చంద్రశేఖర్ తో కలిసి సహాయ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు.ఈ సందర్భంగా 133వ పోలింగ్ కేంద్ర బూత్ స్థాయి అధికారి సాయి శ్రావణి, 132వ పోలింగ్ కేంద్ర బూత్ స్థాయి అధికారి కృష్ణ కాంత్, బూత్ స్థాయి ఏజెంట్ 2 సురేష్ కుమార్ జైన్, బూత్ స్థాయి ఏజెంట్ 2 వేమూరి అనిల్ లతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, సవరణలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవి శెట్టి బాబురావు, పోతురాజు వెంకట్ తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి బూత్‌లో సహాయ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలని నాయకులు అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.