హనుమాన్ నగర్లో జోరుగా కొనసాగుతున్న యస్ ఐఆర్ కార్యక్రమం ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ
జనం న్యూస్ జూలై 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : హనుమాన్ నగర్ పోలింగ్ స్టేషన్ నెం.603 పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ యస్ ఐఆర్ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు ప్రమీల, ఎం. లలిత, ఆర్. రాజేశ్వరి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయడంతో పాటు, నింపిన ఫారాలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు బాలు యాదవ్, రవి తదితరులు పాల్గొని ఓటర్లను చైతన్యపరిచారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ప్రతి అర్హుడైన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ, స్వీకరణ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని వారు కోరారు.యస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా బి యల్ ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తూ, అవసరమైన ఫారాలను స్వీకరిస్తున్నారు.