జాతీయ నులిపురుగుల నివారణాదినోత్సవం

July 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 14 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )బీబీపేట మండలం సోమవారం ముదిరాజ్ వాడలోగల ప్రభుత్వ ప్రాథమికపాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు అల్బెన్దజోల్ మాత్రలు వేసిన వైద్య సిబ్బంది ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఈ అల్బెన్దజోల్ మాత్రవేసుకోవడం యొక్క ఆవశ్యకత విద్యార్థులకు తెలియజేస్తూ భోజనం చేసేముందు భోజనం చేసిన తర్వాత మూత్రశాల, మరుగుదొడ్డి,కి పోయివచ్చిన తర్వాత ప్రతీసారి సబ్బు, నీళ్లతో శుభ్రంగా సరిఅయిన పద్దతిప్రకారం చేతులు కడుక్కోవాలని లేకపోతే అపరిశుభ్రంగా ఉన్న చేతులతో ఆహారం తినడం ద్వారా వివిధరకాల నులిపురుగుల ( నట్టల) గ్రుడ్లు పొట్టలోకివెళ్లి అక్కడ పరాన్న జీవిగా వాటి పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగి తీవ్రమైన కడుపునొప్పి వాంతులు అయ్యేప్రమాదం ఉన్నది అని ఇంకా పిల్లలు శారీరకంగా బాగా బలహీనపడిపోయి చదువులోనూ ఇంకా అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోతారని అందుకే ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు 1 నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఈ అల్బెన్దజోల్ మాత్రను ఉచితంగా అందజేస్తుంది. ఈ మాత్ర అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ ,ప్రయివేట్ పాఠశాలల్లో జూనియర్ కాలేజీలల్లో , చదువు మధ్యలో మానేసిన వారికి ఇంటివద్దనే ఈ మాత్ర వేయడం జరుగుతుందని తెలియజేసినారు కార్యక్రమంలో సర్పంచ్ సాద్వికసాయినాథ్, వార్డు మెంబర్ లత డాక్టర్ శిరీష ,సి హచ్. ఓ ప్రమీల, ఆరోగ్యకార్యకర్త హరిప్రసాద్, ఆశ మణెమ్మ, పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper