చిలిపిచెడు మండల్ ఫైజాబాద్ ఎఫ్ పీ ఓ ను సందర్శించిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు
జనం న్యూస్ జూలై 17 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లాచిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఎఫ్ పీ ఓ పనితీరు, నిర్వహణ తీరు గురించి ఆరా తీశారు. సంఘంలో ఎంతమంది రైతులు సభ్యులుగా ఉన్నారని, రైతులకు ఎఫ్ పీ ఓ ఏ విధంగా సహాయపడుతుందని అడిగి తెలుసుకున్నారు.రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాలు, రసాయన ఎరువుల సరఫరా వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున సరఫరా అయ్యే యూరియా రవాణాకు అయ్యే కిరాయి, హమాలి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తే రైతుకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా చర్చించారు.ఎఫ్ పీ ఓ చైర్మన్ ఎం.డి. యాసిన్ మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘం కార్యకలాపాలు, రైతులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ ప్రణాళికల గురించి కులంకషంగా వివరించారు.రైతులు సంఘటితంగా ఉంటే వ్యవసాయంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయోఎఫ్ పీ ఓ ల ద్వారా రైతుల ఆదాయం ఎలా పెరుగుతుందో విద్యార్థులు ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు హారిక. హరిణి. లావణ్య. నికిత. వందిత. రైతులు పాల్గొన్నారు.