చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సానుభూతి
జనం న్యూస్ | జూలై 31 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ మరణవార్త తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, రుక్కమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎస్ఏటీ (SAT) చైర్మన్, వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి, కూకట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు కూడా పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రుక్కమ్మ మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.