రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో వరల్డ్ పెయింటింగ్ డే
జనం న్యూస్ : 31 జూలై శుక్రవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట తెలంగాణ అస్తిత్వం: ఫస్ట్ ఆగస్టు వరల్డ్ పెయింటింగ్ డే పురస్కరించుకొని స్థాని క రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ బతుకు చిత్రాల ప్రదర్శనను అంతర్జాతీయ చిత్రకా రులు రుస్తుం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ సమాజంలో చిత్రకళ ప్రాము ఖ్యత ఆవశ్యకత గురించి వివరిస్తూ చిత్రాన్ని చిత్తరువు, చిత్రలేఖనం, పెయింటింగ్ అని ఆదిమానవుని ప్రస్థానం ప్రకృతిలో ఉరుములకు మెరుపులకు భయపడి గుహలల్లో దాక్కొని శక్తి ఆకారాన్ని గీసుకొని శరను పొందినాడాని, దైనందిన జీవన విధానాన్ని రాళ్ల పై చెక్కుకొని నాటినుండి నేటివరకు చిత్రకళా ఎన్నో రకాలుగా రూపాంతరం చెంది రకరకాల పేపర్స్ క్యాన్వాస్ ప్రకృతిలో ప్రతి వస్తువు సంసృతులపై చిత్రకళ తన ఉనికిని చాటుకొని ఆధునిక యుగంలో డ్రాయింగ్, డిజైన్, స్కల్పచర్, పెయింటింగ్ ప్రార్థనా, గుళ్ళూ గోపురాలు శిల్పాలు ఆర్కిటేక్ డ్యాములు ఇంజనీ రింగ్ వైద్య విద్య వ్యాపార సినిమా ప్రెస్ చరిత్ర ప్రపంచ సంస్కృతి మొదలగు వాటిపై చిత్రకళ పెయింటింగ్ రేఖా రంగుల విన్యాస ప్రభావం ప్రతి రంగంపై పులుముకుంది. వరల్డ్ పెయింటింగ్ డే అందరి జీవితాలను కళావంతం చేయాలని ఐక్యత శాంతి సౌభగ్యాలను పెంపొందించాలని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్ర కారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబినా రుస్తుం, రహీమ్ ఎం డి తదితరులు పాల్గొన్నారు.