జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50% రాయితీ కల్పించాలి

June 22, 2026 | తెలంగాణ

టియూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్ష కార్యదర్శులు డా: బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్.

ప్రజావాణి కార్యక్రమంలో వినతి

జనం న్యూస్, జూన్ 22, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50% రాయితీ కల్పించాలని కోరుతూ జర్నలిస్టు యూనియన్ (ఐజేయు) పక్షాన సోమవారం ప్రజావాణిలో రెవెన్యూ డివిజన్ అధికారి కి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన రెవెన్యూ డివిజన్ అధికారి జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ ఇవ్వాలని పట్టణం లోని ప్రైవేటు విద్యాసంస్థలను ఆదేశించాలనీ డిఈవో రాము వినతి పత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డా : బూరం సంజీవ్,మహమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో కాలం గడుపుతున్నారన్నారు. జర్నలిస్టు వృత్తినే సామాజిక సేవగా భావిస్తూ పనిచేస్తున్న చాలామంది జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించడానికి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ , ఓంకారి శ్రీనివాస్,బొల్లం రాజు,మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ సభ్యులు ఆదిల్ పాషా, రమణ, ఏసమేని గణేష్, ఎండి అభిద్, శశి కుమారు, అమ్ముల ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper