నిడమనూరులో ఆత్మహత్య
జనం న్యూస్: జూన్ 22 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్
నిడమనూరు మండలం సాయి నగర్ కాలనీ కి చెందిన ఖమ్మంపాటి శ్రీను, వయసు 38, తండ్రి మల్లయ్య, కులం: రజక అను వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం మేరకు స్థానిక పోలీస్ అధికారులు ఇంటికి వెళ్లి చూడగా బయట తలుపులు బిగించి లోపల ఉరివేసుకొని చనిపోయాడు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మృతుడి మరణాన్ని ధ్రువీకరించి, స్థానికుల వివరాల ప్రకారం రెండు నెలల క్రితం మృతుడికి, మృతుడి భార్య లక్ష్మికి మధ్య కుటుంబ పరమైన గొడవలు తలెత్తాయి దాంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇట్టి విషయమై మృతుడు ఈరోజు మధ్యాహ్నం మృతి చెందాడని మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు.