జహీరాబాద్‌లో ఘనంగా నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు,

August 13, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం ఆగస్టు 12. 08. 2026నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్లే గారు, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు మంగళవారం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి.ఆయన స్వగ్రామం అయినా చిక్కుర్తి గ్రామం, న్యాల్కల్ మండలం నుండి యువత అందరు కలిసి ఆయన పుట్టినరోజున నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో నవోదయ సిద్ధార్థ మాట్లాడుతూ… ప్రజాసేవలోనే తనకు నిజమైన తృప్తి ఉందన్నారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, మానవ హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు, పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బరూర్ దిలీప్, ఖలీల్పూర్ శివకుమార్, డా. బొర్రాన్ బాబు రావు, సాయికిరణ్, వికాస్ కుమార్ మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సిద్ధార్థకు ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకున్నారు

🌐 Select Language:
📰 ePaper