దేశభక్తి చాటేలా విద్యార్థులతో ఘనంగా జాతీయ జెండాల ప్రదర్శనా చేసిన బిజెపి మండల అధ్యక్షులు రామకృష్ణ
జనం న్యూస్ ఆగస్టు 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, తిరంగా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశభక్తికి ప్రతీక అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కేవలం జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదని, దేశం పట్ల మనకున్న ప్రేమను, బాధ్యతను, ఐక్యతను చాటే గొప్ప కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని ప్రజలను కోరారు.విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాదులు అని, చిన్ననాటి నుంచే వారిలో దేశభక్తి, జాతీయ ఐక్యత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు.దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ఐక్యతను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ముందుగా భారతీయులం అనే భావనతో దేశం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, విద్యతో పాటు దేశ చరిత్ర, స్వాతంత్ర్య మరయోధుల త్యాగాలు, రాజ్యాంగ విలువల గురించి తెలుసుకోవాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి జాతీయ జెండాకు ఘనమైన గౌరవం ఇవ్వాలని కోరారు.“తిరంగా మన గర్వం – భారత్ మన గౌరవం” అనే నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా సాగింది.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, సీనియర్ నాయకులు బాసని విద్యాసాగర్, మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, భూత్ అధ్యక్షులు బాసని నవీన్, కన్నెబోయిన రమేష్, బత్తుల రాజేష్, ఆనుకారి శివాజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు,యువత తదితరులు పాల్గొన్నారు…