జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు ఎక్కడ

August 28, 2026 | వైరల్ వార్తలు

అసలు డాక్టర్ ఏమయ్యాడు..?

జహీరాబాద్ ఆసుపత్రిలో కలకలం విచారణ జరిపించాలని డిమాండ్ వివరాలసేకరణకు ప్రత్యేక టీం

జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ తేదీ 28 -08-2026జహీరాబాద్: అందోల్లో ఇద్దరు డాక్టర్లు సస్పెండ్ అయిన ఘటన మరువక ముందే, సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. అసుపత్రిలో నిరంతరం సేవ లు అందించాల్సిన డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఓపీ సమయం ముగిసిన తర్వాత డ్యూటీలో ఉండా ల్సిన వైద్యులు అందు బాటులో లేరు. దీంతో ఓ ప్రైవేటు డాక్టర్ వచ్చి ఆసుపత్రిలోని రోగులకు సుమారు అరగంట పాటు చికిత్స అందించడం కలకలం రేపింది. స్థానికులు ఈ విషయమై నిలదీయడంతో సదరు ప్రైవేట్ డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. విధులకు డుమ్మా కొట్టి బినామీతో ట్రీట్మెంట్!ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఒక విస్తుపోయే సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రాంగణంలో, ఎవరూ గుర్తుపట్టని ఒక ప్రైవేటు వ్యక్తి దర్జాగా కూర్చుని వైద్య సేవలు అందించడం తీవ్ర విమ ర్శలకు దారి తీస్తోంది. అసలు ఆసుపత్రిలో ఏం జరుగు తోందో, తమకు ట్రీట్మెంట్ ఇస్తున్నది డాక్టరో కాదో అర్థం కాక రోగులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆసుపత్రిలో కూర్చుని వైద్యం చేస్తున్న ఆ అగంతకుడు ఎవరు? అతనికి రోగులను పరీ క్షించేందుకు ఉన్న కనీస అర్హతలు ఏమిటి? విధుల్లో ఉండాల్సిన ప్రభుత్వ డాక్టర్ ఎటు వెళ్ళాడు? తన డ్యూటీని స్వయంగా ఆయనే ఈ ప్రైవేటు వ్యక్తికి (బినా మీకి) అప్పగించి వెళ్లాడా? లేక ఆ వ్యక్తే అనధికారికంగావైద్యం కోసం నీరిక్షిస్తున్న ప్రజలుఆసుపత్రిలోకి చొరబడ్డాడా? అర్హత లేని ఈ వ్యక్తి చేసిన వైద్యం వికటించి ఏ రోగికైనా ప్రాణాపాయం జరిగితే దానికి బాధ్యత వహించేది ఎవరు? అన్న ప్రశ్నలు స్థానికంగా తొలచివేస్తున్నాయి. ఈ వ్యవహారం కేవలం ఈ ఒక్కరోజే జరిగిం దా? లేక గత కొంతకాలంగా అధి కారుల కళ్ళు గప్పి ఇదే తంతు సాగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తక్షణమే విచారణ జరిపించాలిప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులకు సంజీవని లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి భద్రతా లోపాలు, నిర్లక్ష్యం చోటు చేసుకోవడం వైద్య శాఖ పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోంది. ఇంతకీ ఎవరు ఈ ప్రబుద్ధుడు? అతని కి ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించింది ఎవరు? అనే కోణంలో లోతైన విచారణ జరగాల్సి ఉంది. ఈ వ్యవహారం పై ఉన్నతాధికారులు వెంటనే ఒక ప్రత్యేక కమిటీని నియ మించి వాస్తవాలను తేల్చాలి. డ్యూటీలో ఉండాల్సిన ప్రభు త్వ డాక్టర్ విధులకు ఎగనామం పెట్టి, వేరొకరిని తన స్థానంలో పెట్టినట్లు రుజువైతే సదరు వైద్యుడిని తక్షణమే సస్పెండ్ చేయాలి. అలాగే అనధికారికంగా వైద్యం చేసిన ప్రైవేటు ప్రైవేట్ వ్యక్తితో వైద్యం!వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సామాన్యుల ప్రాణాలతో ఆదే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పన రావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ముక్తకం ఠంతో కోరుతున్నారు.కనిపించని వైద్యాధికారులు..ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓతో పాటు డ్యూటీ డాక్టర్లు ఎవరూ కూడా అందుబాటులో లేకపో వడంతో రోగులు రెండు గంటలుగా వైద్యం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రెండు మృతదేహాలకు పోస్టుమార్టం చేయడంలో జాప్యం జరిగినట్లు సమాచారం. రోజుకు 1000 మందికి పైగా రోగులు వచ్చే ఈ పెద్ద ఏరియా ఆసుపత్రిలో కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే ఓపీ చూసి వెళ్లిపోవడంతో ఆసుపత్రి పరిపాలన, వైద్య సేవల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.విచారణకు ఆదేశాలు డీసీహెచ్ఎస్ డాక్టర్. శ్రీధర్ ప్రైవేటు వైద్యులు చికిత్సలు అందించడం, డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ఇద్దరు వైద్యు ల ద్విసభ్య కమిటీతో విచారణ చేస్తున్నామని నివేది క అనంతరం చర్యలు తీసుకుంటామని సంగా రెడ్డి డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ చెప్పారు. ఓపీ ఆనం తరం వైద్యులు ఇళ్లకు వెళ్లిపోవడం, రాత్రి విధులు నిర్వహించడంతో ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చి ఉంటారని చెప్పారు. ఏదేమైనా నిర్లక్ష్యంగా వ్యవహ రించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

🌐 Select Language:
📰 ePaper