జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా నరేష్ గౌడ్

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్. 14. 06. 2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం : నియామకం జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం నరేష్ గౌడ్‌ను టౌన్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ నరేష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేయడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన కృషి చేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి నరేష్ గౌడ్ నాయకత్వం దోహదపడుతుందని పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని నరేష్ గౌడ్ తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే క్రమంలో పలు కీలక నియామకాలు చేపడుతోంది.

🌐 Select Language:
📰 ePaper