మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జూన్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భవిష్యత్ తరాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిక్సూచి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేసుకున్నారు. అనంతరం మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాక జోడో యాత్ర చేసి దేశాన్ని సంఘటితం చేశారని , యూపీఏ హయాంలో రెండుసార్లు ప్రధాని పీఠాన్ని అధిరోహించే అవకాశం వచ్చినప్పటికీ తృణప్రయంగా పదవిని వదులుకున్న త్యాగశీలి అని కొనియాడారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో కులగణన అనే అంశాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడని అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని, రాబోవు రోజుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైనాల కుమారస్వామి, నిమ్మల రమేష్, దుబాస్ కృష్ణమూర్తి వైద్యుల వెంకటరాజిరెడ్డి, సర్పంచ్ గజ్జి ఐలయ్య, మామిడిపల్లి సాంబయ్య నాయకులు బసాని రవి,జగన్, లాడే రాజ్ కుమార్, మారపెల్లి రాజేందర్, మసికే కుమార్, వడ్డేపల్లి శ్రీను, వీరన్న, తదితరులు పాల్గొన్నారు…..