తడ్కల్‌లో టీవైజేఎఫ్ ఐడీ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధం

June 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ తేదీ 19 జూన్కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీవైజేఎఫ్) ఆధ్వర్యంలో రేపు ఉదయం 11:00 గంటలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు ఆదేశానుసారం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ హాజరుకానున్నారు.ఈ సందర్భంగా టీవైజేఎఫ్ సభ్యులకు టీవైజేఎఫ్ ఐడీ కార్డులు, హెల్త్ కార్డులు, అలాగే జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా పథకానికి సంబంధించిన సర్టిఫికెట్లు అందజేయనున్నారు. టీవైజేఎఫ్ సభ్యులందరూ రేపు ఉదయం 11:00 గంటలకు తప్పకుండా హాజరై తమ ఐడీ కార్డులు, హెల్త్ కార్డులు, ఉచిత విద్యా సర్టిఫికెట్లను స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత, సంస్థ బలోపేతమే టీవైజేఎఫ్ ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper