జిల్లా కలెక్టర్ స్పందించండి!

జనం న్యూస్ 16 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికురాలు పద్మమ్మ కు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలి విధి నిర్వహణ లో ఉన్నా ఐజ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికురాలు పద్మ మ్మ ను ఢీ కొట్టిన బోలోరా వాహనం తీవ్ర గాయల పాలైన పద్మమ్మ ను మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు తరలింపు రెక్కడితే గానీ, డొక్కాడని నిరుపేద మాదిగ సామాజిక వర్గం కు చెందిన మహిళా ఈ ప్రమాదం పద్మ మ్మ కుటుంబానికి పెను భారం ఇప్పటికే సకాలంలో అందని జీతాల కారణం గా కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి కుటుంభాన్నీ నెట్టు కొస్తున్నా పద్మమ్మ ఈ రోజు విధి నిర్వహణ లో ఉంటూ ప్రమాదం లో తీవ్ర మైన గాయల పాలు కావడం తో ములిగే నక్క పై తాటి కాయ పడ్డ ట్టు అయ్యింది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మీట్టా డుతున్నా ఆ కుటుంబానికి వైద్య ఖర్చులు భరించడం చాలా కష్టం కావునా నిరంతరం పట్టణ సేవా లో బాగా స్వామి గా తమ కర్తవ్యం ను నిర్వర్తిస్త ఐజ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికురాలు పై మనవియ కోణం లో అలోచించి ప్రభుత్వం వారి బాధ్యత గా భావించి, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించేందుకు తగు చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం