జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం ప్రైవేట్ హాస్పిటల్ లో నిర్లక్ష్యం

August 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 24 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రిలో విచ్చలవిడిగా మనుషులు ప్రాణాలతో వ్యాపారం బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పసిపాప మృతికి కారణమైన సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్‌ యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆ ప్రయివేట్ హాస్పిటల్ ను మూసివేయాలి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చేనుగోనిపల్లికి చెందిన హరీష్ శ్రావణి దంపతుల మూడు నెలల పసికందు మృతి చెందింది. అనారోగ్యంతో పసికందును గద్వాల పట్టణంలోని సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లితే చికిత్స సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన చెందారు.జిల్లాలోని ప్రైవేటు హాస్పటల్లో విచ్చలవిడిగా వైద్యంను కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తే కూడా ప్రైవేట్ హాస్పిటల్ లకు రేఫర్ చేస్తా ఉన్నారు.గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రవేటు వ్యవస్థను నడుపుకుంటూ పేదలకు సరైన వైద్యం అందించకుండా దోపిడీ చేస్తా ఉన్నారు.ప్రవేట్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు లేకుండా చిన్న రూములలో గదులలో వందల మంది పేషెంట్లను నిలబెట్టడం మరియు టాయిలెట్ రూమ్స్ బాత్రూమ్స్ లేకుండా కూడా నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఎంక్వయిరీ చేసి ఇటువంటి ప్రైవేట్ హాస్పటలను మూసివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.జోగులాంబ గద్వాల జిల్లాలో చాలాసార్లు ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం వలన మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ వాటికి తగ్గట్టు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని అన్నారు.

🌐 Select Language:
📰 ePaper