తెలంగాణలో వచ్చేది బీసీల రాజ్యం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తీన్మార్ మల్లన్న నియోజకవర్గ ఇన్చార్జ్ నరసింహ
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం సంగారెడ్డి జిల్లాఆగస్టు 23 శీను తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీసీల ప్రభుత్వం అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న నేతృత్వంలో బీసీలంతా ఏకం అవుతున్నారని సెప్టెంబర్ 17 నుండి మల్లన్న నిర్వహించే పాదయాత్ర తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయనున్నారని సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మేదపల్లి నరసింహ తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 శాతం కూడా లేని అగ్రవర్ణాల గత 79 సంవత్సరాలుగా పాలించారని 50% పైగా ఉన్న బీసీలు రాజ్యాధికారం లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీసీలకు సరైన న్యాయం జరగడం లేదని సమైక్యాంధ్రలో మోసపోయిన మాదిరిగానే తెలంగాణలో సైతం బీసీలు మరోసారి మోసానికి గురి అయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా లో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారని త్వరలో జిల్లాలో చేరికలు ఉంటాయని తెలిపారు బుడుగు బలహీన వర్గాలు చైతన్యం కావాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని ఆయన పేర్కొన్నారు అధికార కాంగ్రెస్ పార్టీలో రెడ్ల రాజ్యం కొనసాగుతుండగా ప్రతిపక్షం విఆర్ఎస్ లో వెలమరాజ్యం నడుస్తుందని ఆయన ఆరోపించారు బీసీలకు అండగా నిలిచేది తీన్మార్ మల్లన్న లాంటి నాయకులేనని ఆయన అన్నారు త్వరలో సంగారెడ్డి జిల్లాలో పర్యటించటం జరుగుతుందని ఆయన తెలిపారు సంగారెడ్డి కేంద్రంగా త్వరలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు