బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో పాల్గొన్న దాట్ల సుబ్బరాజు

August 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 24 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు జరిగిన బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సమావేశంలో ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు పాల్గొని బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదని బీసీల రాజకీయ సాధికారతకు బలమైన పునాది అని అన్నారు. గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగి కొత్త నాయకత్వం తయారవు తుందని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి సంక్షేమం రాజకీయ సాధికారతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తున్నారని ఇచ్చిన హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించి బీసీ సమాజానికి న్యాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper