జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం 14 లక్షల మంది విద్యార్థులకు రేవంత్ వెన్నుపోటు

May 7, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 07 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసేందుకే చీకటి జీఓ నెంబర్ 7 తక్షణమే జీవోను రద్దు చేయాలి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్బంగా గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్.విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా రేవంత్ రెడ్డి కేసీఆర్ స్కీమ్స్‌కే కాదు.. వైఎస్ పథకాలకు పాత్ర వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.ఓవైపు గురుకులాలను దెబ్బతీసి.. ఉన్నత విద్యకూ ఉరి వేయడం సిగ్గు చేటు.దుర్మార్గమైన జీఓను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి.రూ. 10 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన “జీఓ-7” దుర్మార్గమని మండిపడ్డారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పేద విద్యార్థుల ప్రాణాధార పథకాన్ని క్రమంగా రద్దు చేయాలనే కుట్రలో భాగంగానే ఈ జీఓని తీసుకువచ్చారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ నిర్ణయం ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యపై ఘోరమైన దాడిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన ఘాటు లేఖను గుర్తుచేస్తూ, “విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు ఆడకండి” అనే హెచ్చరికను ప్రభుత్వం గంభీరంగా తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం దానిని బలహీనపరిచే విధానాలను అవలంబించడం అత్యంత దురదృష్టకరమన్నారు. గతంలో విజయవంతంగా అమలైన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిలిపివేస్తూ, విద్యార్థుల ఆశలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. గురుకుల విద్యా వ్యవస్థను బలహీనపరిచిన తర్వాత, ఇప్పుడు ఉన్నత విద్యపై కూడా కత్తి పెట్టడం వల్ల పేద విద్యార్థులు చదువును మధ్యలోనే వదిలే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్థి లోకం ఒక్కసారి నడుము బిగిస్తే పరిస్థితులు ఎలా మారుతాయో ప్రభుత్వం గుర్తుంచుకోవాలని కురువ పల్లయ్య ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నరసింహ, మార్క్, కిరణ్, మాధవ్, అనస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper