డ్రాగన్ ప్రూట్కు మంటలు వ్యాపించి రైతుకు తీవ్ర నష్టం ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

June 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు జూన్ 9 2026 శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన అంకె బాలయ్యతన వ్యవసాయ పొలంలో ఎకరాన్నర విస్తీర్ణంలో డ్రాగన్ ప్రూట్ సాగు చేస్తున్నారు. తోటలో మంటలు ఎలా వ్యాపించావో తెలియదు గానీ పంటలోని గడ్డికి మంటలు వ్యాపించి తోటంతా దెబ్బతిని నష్టం వాటిల్లడంతో రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 10 లక్షల దాకా పంటపై పెట్టుబడి పెట్టి ఒక్కసారిగా దగ్డం కావడంతో బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు, గ్రామస్తులు కోరుతున్నారు.

🌐 Select Language:
📰 ePaper