తెలంగాణ రాజ్యాధికార పార్టీ నూతన కమిటీ ఎంపిక
జనం న్యూస్ జూన్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హనుమకొండ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీ ఆర్ పీ) శాయంపేట మండల వివిధ విభాగాల నూతన అధ్యక్షులను నియమిస్తూ నియమించారు మండల పార్టీ అధ్యక్షులుగా మాచర్ల సదానందం, మండల మహిళా అధ్యక్షురాలిగా మాటేటి మణెమ్మలను బాసాని శ్రీనివాస్ గొలుసు కుమారస్వామి మామునూరు రాణి మాదారం సూర్యప్రకాష్ ఎండి అంకుష్ వాలి నర్ర కుమారస్వామి కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.ఈ మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి సత్యనారాయణ మహిళా అధ్యక్షురాలు బాలీనే లక్ష్మి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు తెలంగాణ కొమురయ్య నియామక పత్రాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు నూతన కమిటీలు నిరంతరం శ్రమించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు నూతన అధ్యక్షులు మాచర్ల సదానందం, మాటేటి మణెమ్మ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య నాయకులు, మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..