విశేష్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా రిటైర్డ్ టీచర్‌ను కలిసిన సురభి నవీన్ కుమార్*

June 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్,జూన్ 25 జగిత్యాల జిల్లా, కోరుట్ల : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న విశేష్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కోరుట్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ వెంకట్రెడ్డి గంగాధర్ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అమలు చేస్తున్న పేదల సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి పలు కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని వెంకట్రెడ్డి గంగాధర్ కి అందజేశారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని, ప్రతి వర్గం ప్రజల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సురభి నవీన్ కుమార్ పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను అభినందిస్తూ, దేశాభివృద్ధికి మోదీ నాయకత్వం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేపీ యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper