నందలూరు ఈదరపల్లి బీసీ కాలనీ స్థలం పై వివాదం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లె గ్రామ పొలం సర్వేనెంబర్ 1091 లోకి 63 సెంట్లు పట్టా భూమి కోసం వివాదం నెలకొంది.ఈదరపల్లె గ్రామ పొలం సర్వేనెంబర్ 1091 లో 63 సెంట్లు పట్టా భూమిలో రాయ చోటి సుబ్బన్న 1977 వ సంవత్సరంలో రిజిస్టర్ చేసు కున్నారు.అయితే జీవనోపాధి కోసం రాయచోటి సుబ్బన్న కువైట్ కి వెళ్లి వస్తూ ఉండేవాడు.ఆయన లేని సమయం లో ఈ 1091 సర్వే నెంబర్లులో పట్టా భూమి లో స్థానిక ప్రజాప్రతినిధి 39 మందికి డిఫా రాలు ఇప్పించ డంతో వివాదం నెలకొంది. దీనిపై రాయచోటి సుబ్బన్న ఎమ్మార్వో ఆఫీస్ వారికి ఆర్టిఐ ఆక్ట్ ద్వారా సర్వేనెంబర్ 1091 లో డిఫారాలు ఏమైనా ఇచ్చారని అడగగా, ఇందులో ఎటువంటి డిఫారాలు ఇవ్వలేదని ఎమ్మార్వో ఆఫీస్ వారు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చారు.63 సెంట్లు గాను సర్వే చేయించమని రెవెన్యూ వారికి అర్జీ ఇవ్వగా, 63 సెంట్లకు హద్దులు ఏర్పాటు చేయగా,దానికి కంచి వేసు కోవడానికి రాయచోటి సుబ్బన్న ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబీకులు ప్రయత్నించడం తో తమకు పట్టాలు ఉన్నాయని కొందరు అడ్డుకున్నారు.ఆర్‌ఐ సుశీల్‌పై బాధితుల ఆగ్రహం.గతంలో డబ్బులు తీసుకుని అనుబంధ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపణ.ప్రస్తుతం తమకు న్యాయం చేయడం లేదంటూ ఆర్‌ఐతో వాగ్వాదం.విషయం తెలుసుకుని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.తమ వద్ద డీఫారాలు ఉన్నాయని తమకు న్యాయం చేయాలని వారు మంగళవారం తాసిల్దార్ ఆఫీస్ కార్యాలయం వద్ద బైఠాయించారు. కార్యాలయ సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.కాగా దీనిపై తాసిల్దార్ సుజాత సిబ్బంది వివాదం ఉన్న సంఘటనా స్థలానికి స్థానిక ఎస్సై మల్లికార్జున్ రెడ్డి సిబ్బందితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ గ్రామస్తులకు పట్టాలు ఇచ్చినట్టుగా ఎటువంటి రికార్డులులేవనిఅన్నారు.ఆర్ఎస్సార్ లో ఈ స్థలం పట్టాల్యాండ్ అని ఉన్నట్టుగా తెలిపారు.