నలుగురి ప్రాణాలను కాపాడిన ఈతగాళ్లు

August 6, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్,ఆగష్టు 06,అచ్యుతాపురం:సముద్రంలో బార్జలో ఉండి ఉత్తర ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ కు చెందిన నలుగురు మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ బార్జను మూడు పడవలకు తాళ్ళతో కట్టి ఉంచడం జరిగింది.తాళ్లు తెగిపోవడంతో అదుపు తప్పింది.సముద్రం అల్లకల్లోలంగా ఉండి పెద్ద అలలు రావడంతో బార్జ్ లో ఉన్న 4 మంది సముద్రంలో చిక్కుకుపోయి సహాయం కోరగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాలు మేరకు అచ్యుతాపురం పోలీసులు, మెరైన్ పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు కోస్ట్ గార్డ్ అధికారులు మరియు నేవీ సహాయం కోరగా. అలల ఉధృత ఎక్కువ అవటంతో చివరకు తంతడి గ్రామానికి చెందిన ఈతగాళ్ల సహాయంతో వారిని కాపాడగలగరని స్థానిక సీఐ చంద్రశేఖర రావు, ఎస్ఐ సుధాకర్ తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper