నాగిరెడ్డిపల్లెలో సి,హెచ్, మరియు సబ్ సెంటర్ ఏర్పాటుచేయాలని వైద్యశాఖ మంత్రికి రాచూరి వినతి

June 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ లో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కి నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి వినతిపత్రాన్నిఅందజేశారు .నందలూరుమండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ లోని పరిసర గ్రామాల ప్రజలకు అత్య వసర వైద్య సేవలు, ప్రసూతి సేవలు, శిశు సంరక్షణ, వృద్ధుల వైద్యం ప్రత్యేక వైద్య సేవలు తగిన స్థాయిలో అందుబాటులో లేవని, ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోంది. అత్యవసర సమయాల్లో సమయానికి వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనిగతంలో నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ అర్బన్ పరిధిలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చినప్ప టికీ, హామీఇప్పటివరకుఅమలు కాలేదు. ఇచ్చిన హామీని నిలబెట్టి నాగిరెడ్డిపల్లి కేంద్రంగా 30 పడకల కమ్యూనిటీహెల్త్.సెంటర్‌నుమంజూరు చేయవలసిం దిగామురళికోరారు.అదేవిధంగా ప్రజల ఆరోగ్య రక్షణ కోసంగర్భిణీలు,బాలింతలు చిన్నారులకు ప్రత్యేక వైద్యసేవలు అందించిన మధుమేహం,రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వ హించివృద్ధులు, మహి ళలు, యువతకు క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని,24 గంటల అత్యవసర వైద్యసేవలు అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి.అవసరమైన వైద్యులు, నర్సులు సిబ్బందిని నియమించాలని,నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ భౌగోళికంగా అనేక గ్రామాలకు కేంద్రంగా ఉండటంతో ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది ప్రజలకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని కావున ప్రజల ఆరోగ్య సంక్షే మాన్ని దృష్టిలో ఉంచుకొని నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తక్షణమే మంజూరు చేయవలసిం దిగా వినతిపత్రం ద్వారా తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper