నామపూర్ గ్రామంను సందర్శించిన ఎమ్ పి డి ఇ ఓ ఇ. ప్రేమ్‌సాగర్

July 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 04జులై పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలములోని నామాపూర్ గ్రామమును సందర్శించి వివిధ కార్యక్రమములో పాల్గొన్నారు ఇందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించ తలపెట్టిన కిచెన్ షెడ్లు (వంట గదులు) మరియు టాయిలెట్ల (మరుగుదొడ్లు) నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ తో కలిసి ప్రారంభించినారు మరియు గ్రామములోని ఎంపీపీస్ మరియు జడ పి ఎచ్ స్ పాఠశాలలలో తరగతి గదులను, మధ్యాహ్న భోజన పథకమును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేసినారు.​అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, రికార్డుల నిర్వహణ మరియు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలు మరియు చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.​ఈ కార్యక్రమంలో సర్పంచ్ , మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ సులోచన , ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు మరియు పంచాయతీ సిబ్బంది మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper