ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘జనతా వారధి’

July 3, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జులై 3 ముమ్మిడివరంజులై 3 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)భారతీయ జనతా పార్టీ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమం అమలాపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు.అమలాపురం టౌన్ అద్యక్షుడు అయ్యాల భాస్కరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాద్యక్షుడు శ గనిశెట్టి వెంకటేశ్వరరావు హజరైన మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన వినతులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో వెంటనే సంప్రదించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణ స్పందన వచ్చేలా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికగా ‘జనతా వారధి’ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంబాజీపేట మండల అధ్యక్షుడు కురసా ఆంజనేయులు, అమలాపురం టౌన్ ఓబిసి మోర్చా అద్యక్షుడు పావులూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper