లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెంట లింబాద్రికి ఘన సన్మానం
జనం న్యూస్, జులై 3, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం : మండలంలోని వేములకుర్తి కళాభవన్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్‌ఎంపీ–పీఎంపీ సంఘం సంయుక్త కార్యదర్శి పెంట లింబాద్రిని లైన్స్ క్లబ్ మెట్‌పల్లి మండల, టౌన్ అధ్యక్షులు ఘనంగా సన్మానించారు. అధ్యక్షుల జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ప్రత్యేకంగా గౌరవించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా శ్రీ పెంట లింబాద్రి వైద్య వృత్తిలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవలందిస్తున్నారని ప్రశంసించారు.లైన్స్ క్లబ్ అధ్యక్షుల జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలతో పాటు సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులను సత్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజాలు మాలేపు శంకర్, మొగిలి శ్రీకాంత్, అరె అజయ్, పొన్నం గణేష్, దొనీకెలా శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు నాంపల్లి వెంకటాద్రి, సెరిసల మహేష్, గుమ్మలా నరేష్, పుప్పాల రాజేష్ ఆర్‌ఎంపీ–పీఎంపీ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, అభిమానులు పాల్గొని పెంట లింబాద్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.