సొంత డబ్బులతో రోడ్డు మరమ్మత్తులు చేయించిన ఆకారపు రాజు
జనం న్యూస్ జులై 3, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఐదవ వార్డులో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడవడం వలన కాలనీ వాసులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో, ఐదవ వార్డుకు కౌన్సిలర్ కు పోటీచేసిన ఆకారపు రాజు తమ సొంత నిధులతో మొరం వేయించి రోడ్లను బాగు చేయించి అందుబాటులోకి తెచ్చారు.అధికారులు పట్టించుకోనప్పటికీ ఐదవ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన ఆకారపు రాజు రోడ్లను బాగు చేయించడంతో కాలనీవాసులు ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.